చాలామంది సినీ హీరోయిన్స్ సరోగసీ ద్వారా పిల్లలను కంటూ ఉంటారు. అలా ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు పిల్లలకు జన్మనిచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ సరోగాసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గర్భవతి కాలేదు. కానీ తన భర్త నిక్ తో కలిసి సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె గతంలో స్వయంగా చెప్పారు.
అలాగే మరో బ్యూటీ సన్నీ లియోన్… సన్నీ లియోన్ కూడా సరోగసీ ద్వారా ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. మరో బిడ్డను దత్తత తీసుకుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావ్ కూడా అద్దె గర్భం ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 36 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.
చనిపోయాక కాలి బొటన వేళ్ళను ఎందుకు కడతారో తెలుసా?
అలాగే షారుక్ ఖాన్ గౌరీ ఖాన్ లు కూడా మూడో బిడ్డను సరోగసీ ద్వారా కన్నారు. 40 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనివ్వడం అంత క్షేమం కాదని భావించి సరోగసీ ద్వారా అక్బర్ ఖాన్ కు జన్మనిచ్చారు.
మంచు లక్ష్మి…ఈమె కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. గుజరాత్ చెందిన ఓ మహిళ ద్వారా మంచు లక్ష్మి ఈ బిడ్డకు జన్మనిచ్చారు. ఆఖరిగా కరణ్ జోహార్, ఈయన కూడా సరోగసీ ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ పిల్లల ఆలనాపాలనా తన తల్లి సహాయంతో చూసుకుంటున్నారు.
యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?