సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో హీరోల కొడుకులే కాదు కూతుర్లు కూడా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మగవాళ్లలో చూసుకుంటే నందమూరి తారక రామారావు నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ అప్పట్లో రాణించారు. ప్రస్తుతం మూడవతరం హీరోగా ఎన్టీఆర్ రాణిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అప్పుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు నాగచైతన్య అఖిల్ లు కొనసాగిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. అయితే నట వారసురాళ్లు విషయంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీ కాస్త వెనకబడి ఉందనే చెప్పాలి. హీరోల కుమార్తెలు ఇండస్ట్రీలో రాణించిన సందర్భాలు చాలా తక్కువ.
ALSO READ : నటుడు సునీల్ ఫ్యామిలిని ఎప్పుడైనా చూసారా ? వైఫ్ ఎవరో తెలుసా ?
అయితే సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే కృష్ణ నట వారసురాలిగా ఆయన కుమార్తె మంజుల కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని సినిమాలు కూడా చేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి ఏ మాయ చేసావే లాంటి హిట్ సినిమా తీశారు.
నిజానికి నందమూరి బాలకృష్ణకు జోడీగా మంజుల ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ అప్పట్లో కుదరలేదట. అవును మీరు విన్నది నిజమే. నందమూరి బాలకృష్ణ హీరోగా సౌందర్య హీరోయిన్ గా ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం టాప్ హీరో. ఈ సినిమాలో హీరోయిన్ గా మంజుల ను అనుకున్నారు. బాలయ్య కూడా ఓకే చెప్పాడు. కానీ కొందరు కృష్ణ అభిమానులు డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి మంజుల ఇతర హీరోలతో ఆడిపాడితే పరువు ఏం కావాలని వాగ్వాదానికి దిగారు. దీంతో కృష్ణ ఈ సినిమాకు నో చెప్పారట.
Advertisements
అలా బాలయ్యకు జోడీగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన మంజుల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత మంజుల ప్లేస్ లో సౌందర్య ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక మంజుల లాంగ్ గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో షో సినిమా చేసింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవటం తో నిర్మాతగా మారింది.