విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక్క సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఎంతో కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఒక్కమాటలో చెప్పాలంటే దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ లా ఉంటాడు అనే స్థాయికి ఎదిగాడు. భౌతికంగా లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయన చేసిన సేవలు ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటాయి.
అయితే ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే మనవళ్ళు చైతన్య కృష్ణ,తారకరత్న, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ కు మరో సోదరుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా కెరీర్ లో ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఆయన పేరు త్రివిక్రమరావు. ఈయనకు ఇద్దరు కొడుకులున్నారు. వారి పేర్లు కళ్యాణ్ చక్రవర్తి, హరీన్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే హరీన్ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని సినిమాల్లోకి వచ్చారు. అయితే అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు.
మన స్టార్ హీరోల అసలు పేర్లు మీకు తెలుసా?
మనుషుల్లో దేవుడు సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు హారీన్. 1986లో మామ కోడళ్ళ సవాల్ సినిమాతో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్ళికొడుకులొస్తున్నా సినిమాలో యముడిగా నటించి మెప్పించాడు. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు.