సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ 4 పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉందిపోతూ ఉంటారు. మరి కొంతమంది పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని పిల్లలు,సంసారం అంటూ గడిపేస్తూ ఉంటారు. కాగా మన హీరోయిన్స్ కూడా చాలా మంది అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని సంసారం మొదలుపెట్టారు.
మొదటిగా షాలిని … చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది షాలిని. ఆ తర్వాత సఖి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడే షాలిని పెళ్లి చేసుకుంది. ఆమె వయస్సు అప్పటికీ 21 సంవత్సరాలు. తమిళ స్టార్ హీరో అజిత్ ను షాలిని వివాహం చేసుకుంది.
మరో హీరోయిన్ జూనియర్ శ్రీదేవి. ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే శ్రీదేవి 23 సంవత్సరాలకే రాహుల్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది.
ఇక మరో హీరోయిన్ రాధిక ఆప్టే. ఈ అమ్మడు కూడా 23 ఏళ్లకే వివాహం చేసుకుంది. కానీ ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తోంది.
అలాగే దివ్యభారతి… విక్టరీ వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 18 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకుంది దివ్య భారతి.
జెనీలియా… బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ 24 ఏళ్లకే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు రితేష్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.
ఇక అతిథి రావు హైదరి. ఈ అమ్మడు కూడా అతి తక్కువ వయసులోనే 21 ఏళ్లకే సత్యదేవ్ డీప్ మిశ్రా ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తుంది.
నజ్రియా… రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నజ్రియా పరిచయమైంది. నజ్రియా కూడా అతి తక్కువ వయసులోనే వివాహం చేసుకుంది. మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ను అతి తక్కువ వయసులోనే 19 ఏళ్లకే వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.