కొంతమంది చదువులో బెటర్ అయితే మరికొంతమంది ఆటల్లో మంచి ప్రతిభ కనబరుస్తుంటారు. అయితే ఎవరు జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటారు అనేది విధి నిర్ణయిస్తుంది. ఎంతోమంది చదువుకున్న వాళ్ళే కాక చదువు రాణి వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు. కొంత మంది చదువు రాకపోతే గేమ్స్ పై దృష్టి పెడతారు. కొంతమంది చదువు రాని వారే గేమ్స్ మీద ఫోకస్ పెడతారు అనుకుంటారు కానీ అది నిజం కాదు. నిజానికి దేశంలోనే అత్యంత పాపులర్ గేమ్ క్రికెట్ గురించి ఏ విషయమైనా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఇండియన్ క్రికెటర్స్ లో ఎక్కువ చదువుకుంది ఎవరో తెలుసా?
అతను ఎవరో కాదు ఆవిష్కార్ సాల్వీ. బంగ్లాదేశ్‌పై పోటీలో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు ఆవిష్కార్ సాల్వీ. ఆయననే భారతదేశంలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ అంటారు. సాల్వీ ముంబై తరఫున చాలా ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతను అంతర్జాతీయ స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడు. సాల్వీ కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడాడు. తీవ్రమైన గాయం కారణంగా అతని కెరీర్ నిలిచిపోయింది. సాల్వి ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోసం ఐపిఎల్‌లో కూడా ఆడాడు. ముంబైలో జన్మించిన ఈ బౌలర్ ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలుగా మారదాం అనుకున్న వారు ఇస్రో, నాసా కోసం పని చేయాలనుకునేవారు, అంతరిక్ష అధ్యయనాలు ఆసక్తి ఉన్న ఎవరైనా ఆస్ట్రోఫిజిక్స్ చదువుకోవచ్చు.
ప్రతి సంవత్సరం చాలా మంది ఆటగాళ్లకు భారతదేశం తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తోంది. ఈ ఆటగాళ్లలో కొందరు మాత్రమే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని లాగా ఫేమస్ అవుతారు. కానీ స్టేడియంలో కనిపిస్తున్నామన్న ఉత్సాహంలో, ఆందోళనలో కంగారులో తమ ఆట తీరుతో ప్రేక్షకులను నిరాశ పరిచిన వారూ ఉన్నారు. క్రికెటర్లలో కొంతమందికి చాలా మంచి విద్యా అర్హతలు ఉన్నప్పటికీ, చదువులో అంతగా రాణించని వారు చాలా మంది ఉన్నారు.