దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. అలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజమౌళి. గతంలో బాహుబలి సినిమా తో తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించిన రాజమౌళి ఆర్ఆర్ ఆర్ తో అంతకుమించి అనేలా చేశాడు.
ఇక ప్రతి హీరో కూడా రాజమౌళి సినిమాల్లో నటించాలని అనుకుంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయితే చిన్న పాత్ర వచ్చినా చాలు అని భావిస్తారు. ఇది పక్కన పెడితే రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా చాలా మంది స్టార్స్ మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు ? వాళ్ళు మిస్ చేసుకున్న పాత్రలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
శ్రీదేవి… బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదించారట మేకర్స్. కానీ ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటం తో ఈ సినిమాలో భాగం కాలేకపోయారు శ్రీదేవి. ఆ తర్వాత రమ్యకృష్ణ ఆ పాత్ర చేసింది. అలాగే మంచు లక్ష్మి, మంచు లక్ష్మిని కూడా శివగామి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించారట. కానీ ప్రభాస్ కు తల్లిగా నటించడం ఇష్టం లేక నో చెప్పిందట.
అలాగే తమిళ స్టార్ హీరో సూర్య. బాహుబలి సినిమాలో సూర్య కి ఓ ప్రత్యేక పాత్రను రాసుకున్నాడట రాజమౌళి. కానీ అందుకు సూర్య ఒప్పుకోలేదట. ఇదే విషయాన్ని సికిందర్ ప్రమోషన్ సమయంలో సూర్య చెప్పుకొచ్చాడు. ఛాన్స్ వదులుకున్నందుకు చాలా బాధపడ్డాను అని తెలిపాడు.
వివేక్ ఒబెరాయ్… బాహుబలి సినిమాలో ప్రభాస్ కి పోటీ గా రానా నటించాడు. కానీ మొదట రానా పాత్రలో వివేక్ ను అనుకున్నారట. కానీ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్ ను వదులుకున్నాడు. అలాగే జాన్ అబ్రహం ను కూడా సంప్రదించగా నో చెప్పాడు.
వాళ్లంతా ఫెయిల్యూర్స్.. బాలీవుడ్ స్టార్స్‌పై కంగనా షాకింగ్ కామెంట్స్
అలాగే సోనం కపూర్ బాహుబలి సినిమాలో తమన్నా నటించిన పాత్ర కోసం సోనమ్ కపూర్ ను రాజమౌళి సంప్రదించారట. అయితే ఆమె ఆ ఆఫర్ కు నో చెప్పిందట. మోహన్ లాల్… బాహుబలి కట్టప్ప పాత్రకు మొదట మోహన్ లాల్ పేరును సెలెక్ట్ చేసారట మేకర్స్. మోహన్ లాల్ నో చెప్పటం తో అమితాబ్ బచ్చన్ ని సంప్రదించారట. ఆయన కూడా నో చెప్పారట. ఆఖరికి సత్యరాజ్ ఫైనల్ అయ్యాడు.
‘మా ఇష్టం’ ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ
ఇక మెయిన్ హృతిక్ రోషన్, బాహుబలి సినిమా ఆలోచన వచ్చిన వెంటనే రాజమౌళి మొదట హృతిక్ రోషన్ తో చేయాలని అనుకున్నాడట. కానీ ఆలోచన మార్చుకుని ప్రభాస్ ని ఫైనల్ చేశారు.
సింహాద్రి… సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. మొదట ఎన్టీఆర్ తో కాకుండా ఈ సినిమాని ప్రభాస్ బాలకృష్ణతో చేయాలనుకున్నారు రాజమౌళి. కానీ కుదరక ఎన్టీఆర్ తో చేశాడు. ఈ సినిమా అప్పట్లో రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే నటి అర్చన… మగధీర సినిమాలో శ్రీహరి భార్య గా నటించిన సలోని పాత్ర కోసం అర్చనను సెలెక్ట్ చేశారు. కానీ ఆమె నో చెప్పిందట.
పవన్ కళ్యాణ్, విక్రమార్కుడు సినిమా పవన్ తో చేయాలని అనుకున్నాడట రాజమౌళి. కానీ వివిధ కారణాలతో రాజమౌళి ఈ సినిమాను రవితేజ తో చేశాడు. శ్రద్ధ కపూర్, ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలివియా మోరీస్ పాత్ర కోసం మొదట శ్రద్ధాకపూర్ అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో ఒలివియా ను తీసుకున్నారు.
అలాగే పరిణితి చోప్రా, అలియాభట్ నటించిన సీత పాత్ర కోసం పరిణీతి చోప్రాను సెలెక్ట్ చేసారట. ఆమె నో చెప్పడంతో ఆలియా భట్ ను తీసుకున్నారట. అలాగే కాజల్… యమదొంగ లో మొదట కాజల్ అగర్వాల్ తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో ప్రియమణి ని ఫైనల్ చేశారు.