దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. పాన్ ఇండియా చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.
అలాగే అలియా భట్, అజయ్ దేవగన్ సముద్ర ఖని శ్రీయ కీలక పాత్రల్లో నటించారు. ఇక మార్చి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటించగా రామ్ చరణ్ సరసన అలియాభట్ నటించారు.
నిఖిల్ పల్లవిల లవ్ స్టోరీ….నిఖిల్ సామాన్యుడు కాదు!!
అయితే నిజానికి అలియాభట్ నటించిన సీత పాత్ర కోసం ముందుగా మేకర్స్ సాహో బ్యూటీ శ్రద్ధ కపూర్ ని సంప్రదించారట. కానీ కొన్ని వేరే కారణాల వల్ల శ్రద్ధ కపూర్ నో చెప్పిందట. ఆ తర్వాత వేరొక హీరోయిన్ పరిణితి చోప్రాను సంప్రదించారట.
శృతి మించిన సుమ అక్క కామెడీ మీరు కూడా ఇలానా? ఏంటండీ ఇది..!
ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేయలేక నో చెప్పిందట. అలాగే అమీజాక్సన్ ను మేకర్స్ సంప్రదించగా గర్భవతి కావడంతో నో చెప్పిందట. చివరగా ఆ పాత్ర అలియా భట్ కు చేరింది. అలియాభట్ మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
అలాగే ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ జెన్నీ పాత్రలో నటించింది. నిజానికి జెన్నీ పాత్ర కోసం మొదట హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాలవల్ల తప్పుకుంది. ఆ తర్వాత ఒలీవియా మోరిస్ ను తీసుకున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
ఎన్టీఆర్, వడ్డే నవీన్… బావ, బావమరుదులు ఈ విషయం మీకు తెలుసా ?