అలనాటి తార శ్రీదేవి గురించి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలామంది స్టార్ హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్స్ ను అందుకుంది శ్రీదేవి. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసి తన హవా నడిపింది.
అయితే అప్పట్లోనే నేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో ప్రేమలో పడి ఆ తర్వాత సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది. కాగా బోనికపూర్ తో పెళ్లి జరగడానికి ముందు శ్రీదేవి పెళ్లి విషయంలో ముగ్గురు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయట.
అడవి శేషు హీరోయిన్స్ విషయంలో… కామన్ పాయింట్స్ గమనించారా ?
మొదటగా హీరో రాజశేఖర్… శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి అంటూ శ్రీదేవి తల్లి స్వయంగా రాజశేఖర్ ను కోరారట. అయితే అప్పుడు రాజశేఖర్ కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల నో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు.
ఆ తర్వాత మురళీమోహన్ తో శ్రీదేవి పెళ్లి అంటూ టాక్ నదించింది. కానీ అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న మురళీమోహన్ శ్రీదేవి తో పెళ్లికి నో చెప్పాడట.
మరికొన్నాళ్లు బాలీవుడ్ మిథున్ చక్రవర్తి తో శ్రీదేవి ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్ గా ఈ ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మొదటి భార్యను వదిలేస్తేనే శ్రీదేవితో పెళ్లికి ఒప్పుకుంటాను అని ఆమె తల్లి అన్నారట. అయితే మొదటి భార్య యోగితను పెళ్లి చేసుకున్న తరువాతనే తనకు కలిసి వచ్చిందని మిధున్ చక్రవర్తి చెప్పడంతో చివరికి పెళ్లి క్యాన్సిల్ అయిందట.
ఎన్టీఆర్ కు జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే
ఆఖరికి బోనీకపూర్ ను శ్రీదేవి వివాహం చేసుకుంది. ఇకపోతే బోనీకపూర్ శ్రీదేవిని మాయ చేసి గర్భవతిని చేశాడని, అందుకే వీరి పెళ్లి హడావిడిగా జరిగిందని ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు.