సినీ స్టార్స్ వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్, ఖరీదైన కార్లు, ఖరీదైన ఇల్లు ఇలా ప్రతి విషయంలోనూ ఒక లెవెల్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది హీరోలు షూటింగులతో బిజీ బిజీగా లైఫ్ ను గడుపుతూ ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు.
అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది టాలీవుడ్ హీరోలు లగ్జరీ ఫ్లైట్స్ కొనుగోలు చేశారు. అలా విమానాలు కొన్న హీరోలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి… చిరంజీవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే క్రేజ్ తో రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు వ్యాపార రంగంలో కూడా రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. సినిమాలు వ్యాపారాల రీత్యా మెగా ఫ్యామిలీ కి ఒక సొంత విమానం ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా సొంతంగా ఒక విమానం ఉంది. కుటుంబంతో విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు అల్లుఅర్జున్ ఇందులోనే ప్రయాణం చేస్తారు. ఇక మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒక సొంత విమానం కొనుక్కున్నారు.
అలాగే ప్రభాస్ సైతం షూటింగ్ నిమిత్తం ముంబై హైదరాబాద్ ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేయాల్సి రావడంతో ఖరీదైన విమానాన్ని కొనుక్కున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఓ ప్రత్యేక విమానం ఉంది.
ALSO READ : చిరంజీవి సినిమా పై శేఖర్ మాస్టర్ టంగ్ స్లిప్! సినిమా యూనిట్ కి కష్టాలు తప్పవా ?
మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు కూడా సొంతంగా ఒక విమానం ఉంది. విజయ్ దేవరకొండ కన్నా ముందు వచ్చిన ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే వారు ఎవరికీ కూడా ప్రత్యేక విమానాలు లేవు. విజయ్ దేవరకొండ మాత్రం తక్కువ టైంలోనే ప్రత్యేకంగా విమానం తీసుకున్నారు.
ALSO READ : పెళ్లి చేసుకునే స్త్రీ, పురుషుల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి !!
అలాగే కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా సొంతంగా విమానం ఉంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంలో కూడా నాగార్జున రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ విమానం కొనుగోలు చేశారు.
Advertisements