ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేస్తున్నారు. అందుకుతగ్గట్టుగానే యంగ్ డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ లాంటి చాలా మంది దర్శకులు రీమేక్‌లను చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర కాకుండా బ్రోచే వారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయను అనుకున్నారట. అయితే ఆ యువ దర్శకుడు నానితో అంటే సుందరానికి చేస్తానని మాట ఇచ్చాడట అందుకే పవన్ సినిమాను చేయలేకపోయాడట.
ఆ సమయంలో సాగర్ కె చంద్ర పేరు తెరపైకి వచ్చింది. లేదంటే వివేక్ ఆత్రేయ పవన్ భీమ్లా నాయక్ కు దర్శకత్వం వహించేవాడట.
ఇకపోతే ఇటీవల, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్ తో పాటు పెద్ద సినిమాలు రెండు విడుదల తేదీలను ప్రకటించినప్పుడు నాని అంటే సుందరానికి దాదాపు ఏడు విడుదల తేదీలను ప్రకటించిఅందరి దృష్టిని ఆకర్షించాడు.