అల్లు అర్జున్ కెరీర్ లో మర్చిపోలేని హిట్ ఇచ్చిన చిత్రం జులాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ లు చాలా బాగుంటాయి. కథలో బలం ఉండటం, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవడం, హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావడంతో సినిమా అన్ని విధాలుగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ 40 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు. ఇక విలన్ గా నటించిన సోను సూద్ కూడా బాగా యాక్ట్ చేసాడు.
పాటలు కూడా ఇప్పటికీ వింటూనే ఉంటాం. అప్పటి వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న అల్లు అర్జున్ కి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే వాస్తవానికి ఈ కథను త్రివిక్రమ్… తమిళ స్టార్ హీరో సూర్య కోసం రాసుకున్నాడు. ఆ కథ సూర్యకి చెప్పగా సూర్య కూడా ఓకే చేసాడు గాని అప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆ సినిమాలు అయిన తర్వాత చేస్తాను అన్నాడట.
కాని త్రివిక్రమ్ కి అంత సమయం లేకపోవడంతో… అల్లు అర్జున్ కి చెప్పగా వెంటనే ఓకే చేసాడు. సినిమా షూటింగ్ కూడా వేగంగా జరిగింది. ఇప్పటికీ ఈ సినిమాలో కామెడి సీన్లు వైరల్ అవుతూ ఉంటాయి. సూర్య ఎప్పటికి అయినా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. మహేష్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: యండమూరి కథ చెప్తే చిరంజీవి ఏమన్నారు…? ఆ కథ నాగార్జునకు ఎలా వెళ్ళింది…?