తెలుగు సినిమా స్టామినాని భారతదేశానికి, తద్వారా ప్రపంచానికి చాటిన చిత్రం బాహుబలి. కథాబలం, నటీనటుల సమర్ధత, దర్శకుడి దీక్ష, సాంకేతిక వర్గ అంకితభావం వెరసి ఈ సినిమాని ఓ దృశ్యకావ్యాన్ని చేసాయి. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం విడుదలై యావద్భారతాన్నీ అలరించింది.
అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్ టి నుండి సెకండ్ పార్ట్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అనేక అంచనాల నడుమ బాహుబలి-2 మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలయింది. అనూహ్య విజయం సాధించింది.
భారతదేశంలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా చరిత్రలో నిలిచింది. తెలుగులో రూపొంది.. తమిళ, మళయాళ, హిందీ భాషల్లోకి అనువాదమైన బాహుబలి 2 కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించి అందరి దృష్టినీ టాలీవుడ్‌పై పడేలా చేసింది.
బాహుబలి 2 అప్పుడే రూ.1600 కోట్లుకుపైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి చిత్రంలో రానా భళ్లాల దేవుడిగా కనిపించాడు. బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ భళ్లాలదేవుడిగా కనిపించాడు. అయితే సెకండ్ పార్ట్ లో ఆయన ముఖంపై గీత ఉంటుంది.
అది ఎందుకు వచ్చిందనే విషయం బాహుబలి అభిమానులకి ఎవరికైనా గుర్తుందా? ఆ గీతని భళ్లాలదేవుడు తనకు తానే పెట్టుకుంటాడు. కుమార వర్మ తనకు హాని కలిగించడానికి వచ్చినట్టు అందరినీ నమ్మించడానికి పెట్టుకుంటాడు. ఈ గీత ఎక్కడా మిస్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తపడ్డాడు.
అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మనకు ఆ గీత కనిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న అంశాలపై కూడా రాజమౌళి ఎంత జాగ్రత్త వహిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక రాజమౌళి త్వరలోనే మహేష్ తో సినిమా చేయనున్నారు.
Also Read: రోజురోజుకు అదరగొడుతున్న పఠాన్