టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ బిజీబిజీ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక వరంలాంటిదే. ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయి ప్రశాంతత కోల్పోతున్నారు. కరోనా సమయంలో కొందరు వ్యాపారాలు దెబ్బతిని ఇప్పటి వరకు కోలుకోలేకపోయారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టని వారున్నారు.
నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదో అందరికీ తెలిసిన విషయమే. సరైన నిద్ర లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడుతుంటాయి. అంతేకాకుండా సరైన నిద్ర లేకపోతే చిరాకు టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ పనిమీద సరిగ్గా కాన్సెంట్రేట్ చేయలేకపోతుంటాం. అయితే అతి నిద్ర వల్ల కూడా ఆరోగ్య సమస్యలు బాగానే వచ్చిపడతాయి. నిద్ర శరీరానికి ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులో నిద్ర పోవాలి.
తక్కువ నిద్ర పోయినా ఎక్కువ నిద్ర పోయినా ఆరోగ్య సమస్యలు తప్పవు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే నేటి కాలంలో మాత్రం నిద్రకు అంతగా విలువ ఇవ్వడం లేదు. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న నేటి తరం జనాలు… అతి తక్కువ సమయం నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడుల కారణంగా కూడా రాత్రి సమయాల్లో నిద్ర రాక అలాగే మేల్కొండి పోయి నిద్రలేమి కి గురవుతున్నారు. దీని ద్వారా చిన్న వయసులోనే ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు.
సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల నిద్ర లేమి సమస్యలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేటి తరం జనాలు. అయితే సరైన నిద్ర శరీరానికి అందకపోతే చాలా సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు… కానీ ఎవరు వాటిని మాత్రం పట్టించుకోరు. ఇక ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఒక రోజు నిద్ర సరిగ్గా పోకపోయినా ఎంతో ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. చాలామంది ఒకరోజు నిద్రపోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్క రోజు నిద్ర లేకపోయినా అది ఎంతో ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు.
ఒక్కరోజు నిద్రపోకపోతే దాని ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక్క రోజు నిద్ర పోకపోయినా డీఎన్ఏ లో ఎన్నో మార్పులు జరుగుతాయని.. హాంకాంగ్ కు చెందిన షూ వేస్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. నిద్రని కోల్పోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తన పరిశోధనలో తేలిందని ఈ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన కొంత మందిపై చేసిన పరిశోధనలో విషయం తేలిందని ఆయన వెల్లడించారు.