సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల గురించి ఎన్నో విషయాలు మనం వింటూనే ఉంటాం. వారి సినిమాలు, ఆస్తులు ఇలా ఎన్నో కీలక విషయాలు చర్చకు వస్తు ఉంటాయి. అగ్ర హీరోల సినిమాలకు తీసుకునే పారితోషికం విషయంలో మాత్రం కాస్త ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో గురించి అయితే ఎన్నో వార్తలు చూస్తాం. ఇప్పుడు అతని ఆస్తుల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది.
అతని ఆస్తులు గత పదేళ్ళలో బాగా పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పలు ప్రకటనలతో పాటుగా సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దాదాపు 20 కోట్ల వరకు అతను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను దాదాపు 50 కోట్ల వరకు తీసుకుని మూడేళ్ళ సమయం కేటాయించాడు అంటున్నారు. ఇక కొరటాల శివ సినిమాకు 30 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఇక బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి కార్యక్రమాలు కూడా చేసాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉందని సమాచారం. అలాగే లక్ష్మీ ప్రణతి నుంచి కూడా భారీగా గిఫ్ట్ లు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో చేస్తున్నాడు. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.