రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకులకు ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. కథ విషయం మొదలు అనేక విషయాల్లో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో పాత్ర కోసం తీవ్రంగా కష్టపడి ఆలస్యం అయినా సరే వదలకుండా చేస్తారు. బాహుబలి సినిమా పూర్తైన అయిదేళ్ళకు ఆయన ఒక సినిమా విడుదల చేసారు అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్ గా సినిమా చేస్తారో చెప్పవచ్చు.
ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్దం అయింది. మహేష్ బాబు పాత్ర సినిమాలో ఒక సంచలనం అవుతుంది అని అంటున్నారు. ఇక ఇతర నటీ నటులకు సంబంధించి ఎప్పుడు ప్రకటన వస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం రాజమౌళి ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్. ఆస్ట్రేలియాలో ఒక ఎడారిలో సెట్ వేస్తున్నారని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా అయిన తర్వాత ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడు కాబట్టి జూన్ లోపు వేరే వాళ్ళతో షూట్ పూర్తి చేస్తారట.