ఇటీవల కాలంలో రొమాంటిక్ సీన్స్, అలాగే ముద్దు సీన్లు లేనిదే సినిమా ఉండట్లేదు. ఎలాంటి సినిమా అయినా సరే అలాంటి సన్నివేశాలు 1,2 పడాల్సిందే. అయితే అప్పట్లో సినిమాలలో ముద్దు సీన్స్ అనేవి ఉండేవి కాదు. రొమాంటిక్ సీన్ లకు హీరోలు, హీరోయిన్లు చాలా దూరంగా ఉండే వారు. ఒకవేళ ముద్దు సీన్లు ఉన్న చెంప పైన లేదంటే చేతుల పైన పెట్టేవారు. ఇంతకుమించి పెదవులపై ముద్దు పెట్టే సీన్లు ఉంటే పూల కొమ్మలను అడ్డుపెడుతూనో లేదంటే ఊపుతూ చూపించేవారు.
అయితే అలాంటి సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డోస్ పెంచి చూపించారు. ఈయన సినిమాలలో బొడ్డు పై పండ్లుతో కొట్టడం పెదాలపై పువ్వులు వేయడం హీరోయిన్ శరీరంపై నీళ్ళు చల్లటం వంటి సీన్స్ కనిపిస్తాయి. అప్పట్లోనే రాఘవేంద్రరావు లిప్ లాక్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో.
ALSO READ : భార్యలు చేసే ఆ ఒక్క తప్పు వలనే భర్తలు పరాయి స్త్రీల పై మోజు పడతారట !!
అయితే ఆ తరువాత కానీ అంతకు ముందు కానీ చిరు లిప్ లాక్ జోలికి వెళ్ళలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే… 1990 లో చిరు మంచి జోష్ మీద ఉన్నాడు. మంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నాడు. చిరంజీవితో సినిమాలు చేయడానికి దర్శకులు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అదే సమయంలో లో రాఘవేంద్ర రావు కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈ ఇద్దరూ కలిసి ఘరానా మొగుడు సినిమా చేశారు.
ఈ సినిమాలో నగ్మ హీరోయిన్ గా నటించింది. వాణి విశ్వనాథ్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఓ లిప్ లాక్ సీన్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట రాఘవేంద్రరావు. కానీ చిరు నో చెప్పాడట. అప్పట్లో లిప్ లాక్ అంటే చాలా పెద్ద విషయం అయినప్పటికీ చేసేదిలేక చిరు ఓకే చెప్పారట. అప్పటికీ కూడా ఫ్యాన్స్ సైలెంట్ ఉంటారా లేదా అనే ఆందోళనలో ఉన్నాడట. చివరికి ఎడిటింగ్ లో ఆ సీన్ ను కట్ చేయించాడట.