టాలీవుడ్ సీనియర్ నటి జమున అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా అప్పట్లో ఆమె దాదాపు రెండొందల సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నిన్న ఉదయం ఆమె మరణించారు అని కుటుంబ సభ్యులు ప్రకటించారు. జమునకు అప్పట్లో మంచి స్టార్ ఇమేజ్ ఉండేది. స్టార్ హీరోలు అందరి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు.
పాత్ర ఏ విధంగా ఉన్నా సరే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వినాయక చవితి అనే సినిమాలో ఆమె నటించిన సత్యభామ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో ఆమె దశ తిరిగింది అనే చెప్పాలి. శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో కూడా జమున సత్యభామ పాత్రలో నటించారు. ఆ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్, అక్కినేని సినిమాల్లో ఆమెకు ముందు అవకాశాలు రాలేదు.
కాని తర్వాత మాత్రం వారే పిలిచి అవకాశాలు ఇచ్చారని అంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఆమె చేస్తారనే పేరు ఉంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే దాదాపుగా 80 కోట్ల వరకు ఉంటాయని టాక్. గుంటూరులో జమునకు ఒక ఇల్లు కూడా ఉందని సమాచారం. హైదరాబాద్ లో ఖరీదైన భవనం కూడా ఉంది. అయితే ఆమె ఎక్కడా కూడా హడావుడిగా లేకుండా సింపుల్ గా ఉంటారని అంటారు.