అప్పట్లో కొన్ని కొన్ని కథల విషయంలో నచ్చితే హీరో హీరోయిన్లు ఎక్కడికి అయినా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు లేదా నాటకాలు, పౌరాణిక అంశాల విషయంలో కాస్త పట్టుదలగా ఉండేవారు. అగ్ర హీరో హీరోయిన్లు ఈ తరహా కథలు చేస్తే తమను తాము నటుడిగా గుర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్, భానుమతి వంటి వారు పౌరాణిక సినిమాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు.
ఇక చింతామణి నాటకం విషయంలో భానుమతి చాలా పట్టుదలగా ఉన్నారని అంటారు. అందుకనే ఆమె తన సొంత నిర్మాణ సంస్థలో ఆ నాటకాన్ని సినిమాగా చేయాలని భావించి ముందుకు అడుగు వేసారు. ఆ కథను వెళ్లి అక్కినేనికి చెప్పారు భానుమతి. ఆమె చెప్పిన వెంటనే అక్కినేని నో అన్నారు. ఈ సినిమా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదని ఫ్లాప్ అవుతుందని తాను చేసేది లేదని ఆయన కాస్త పట్టుదలగా చెప్పారు.
ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్ వద్దకు వెళ్లి కథ చెప్పారు. అక్కినేని నో అన్న విషయం కూడా ఆయనకు చెప్పారు. అక్కినేనితో ఎన్టీఆర్ కు అప్పట్లో విభేదాలు ఉన్నాయని అంటారు. అయితే ఆయన వెంటనే ఓకే చెప్పారు. బిల్వమంగళుడి పాత్రను ఎన్టీఆర్ చేయడానికి ముందుకు వచ్చారు. నాటకంలో మాదిరిగా కాకుండా కథ కాస్త మార్చారు. అయితే సెన్సార్ విషయంలో షాక్ తగిలింది. బలంగా ఉన్న డైలాగ్ లు అన్నీ ఆపేశారు. దీనితో సినిమా ఫ్లాప్ అయింది. భానుమతి 30 లక్షలకు పైగా నష్టపోయారు.