హీరోయిన్ సమంత నాగచైతన్య తో విడాకుల తర్వాత జోష్ పెంచింది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తోంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తుంది సమంత. మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో పోస్టులను షేర్ చేస్తుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో తరచూ కొన్ని పోస్ట్ లు పెడుతుంది సమంత. అయితే ఈ యాడ్ లను పోస్ట్ చేసేందుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందట. ఇది కేవలం పోస్ట్ చేసినందుకే ఈ సొమ్మును తీసుకుంటుందట.
చిరు ‘ఆపద్బాంధవుడు’ హీరోయిన్ ఎలా అయిపోయిందో చూశారా ?
వాటిలో నటిస్తే కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. ఇప్పటికే చాలావరకు కంపెనీలు సమంతతో యాడ్స్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. సమంత కూడా ఒక్కో బ్రాండ్ కు ఒక్కో విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుదట.
అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ఉదయ్ కిరణ్ తో గొడవ పడ్డ డైరెక్టర్ తేజ ! చివరికి ఏమైందంటే ?
ఇక సినిమాల విషయానికొస్తే సమంత యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే శాకుంతలం సినిమా చేస్తోంది. తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.