కేజిఎఫ్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ అందుకొని స్టార్ గా మారిపోయాడు రాక్ స్టార్ యష్. ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అంతకుమించి విజయం సాధించింది. అయితే కేజిఎఫ్ కు ముందు తెలుగు ప్రేక్షకులు యష్ ను చూసింది లేదు. అతను ఎవరో కూడా తెలీదు. రెండు మీడియం రేంజ్ సినిమాలు మధ్య కే జి ఎఫ్ సినిమా 2018 లో రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో కే జి ఎఫ్ ను ప్రేక్షకులు చూశారు. కట్ చేస్తే కే జి ఎఫ్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. సినిమాలో యష్ చూపించిన యాటిట్యూడ్ కు మేనరిజం కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.
అయితే హీరో యష్ గురించి సినీ అభిమానులకు చాలా విషయాలు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు… కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. నటుడు అయ్యాక యష్ గా పేరు మార్చుకున్నాడు. 1986 జనవరి 8 న కర్ణాటకలోని హసన్ భువనహళ్లి లో పుట్టాడు. తండ్రి అరుణ్ కుమార్ ఆర్ టి సి బస్ డ్రైవర్, తల్లి పేరు పుష్ప లత. చెల్లెలు నందిని కూడా ఉంది.
ఇక యష్ చదువు అంతా కూడా మైసూర్ లో జరిగింది. మహాజన ఎడ్యుకేషన్ సొసైటీ లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేశాడు యష్. చదువు పూర్తయ్యాక నాటక రచయిత బి విక్రాంత్ ఏర్పాటుచేసిన బెనకా డ్రామా బృందంలో చేరాడు. నటనపై ఆసక్తి చిన్నప్పటినుంచి ఉండేది. అందుకే అటువైపు కదిలాడు. మొదట్లో స్టేజ్ షోలు చేసేవాడు. ఆ తర్వాత ఉత్తరాయణ అనే సీరియల్లో నటించాడు.
READ ALSO : అతడు సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా ఎందుకు చూస్తారు…?
ఆ తరువాత నందగోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివ లలో సీరియల్స్ లో నటించాడు. అయితే సినిమాల్లోకి మొదట ఎంట్రీ ఇచ్చింది మాత్రం సింగర్ గా ఇచ్చాడు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా సహాయనటుడిగా సినిమాల్లోకి వచ్చాడు. అయితే నందగోకుల లో హీరోయిన్ గా నటించిన రాధిక పండిట్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ శశాంక్ దర్శకత్వంలో మొగ్గిన మనసు సినిమా చేశారు. దీనితో పాటు మరో నాలుగు సినిమాలలో కూడా నటించారు. అలా వీరి పరిచయం ప్రేమగా మారి… పెళ్లి వరకు వెళ్ళింది.
READ ALSO : అప్పటి హీరో వేణు తొట్టెంపూడి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ?
2016 ఆగస్టు లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప బాబు ఉన్నారు. ఆతర్వాత 2013లో వచ్చిన గూగ్లీ, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి వంటి సినిమాల్లో నటించి హిట్ అందుకున్నాడు. 2017లో యశో మార్గ అనే సంస్థను స్థాపించి తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ఏరియాల కి మంచినీటిని సరఫరా చేయించాడు.
ఇక ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. కే జి ఎఫ్ సినిమాకు మొదట ప్రశాంత్ నీల్ యష్ ను హీరోగా అనుకోలేదట. చాలా మంది హీరోలను సంప్రదించాడట. ఒక్కో భాషలో ఒక్కో హీరో అని అనుకున్నారట. కానీ చివరికి యష్ తగిలాడు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశాడు. సినిమా హిట్ అయింది. 250 కోట్ల రూపాయలను కొల్లగొట్టి కన్నడలో నెంబర్ వన్ సినిమా గా నిలిచింది.
చాప్టర్-2 కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ… కలెక్షన్లను కొల్లగొట్టే మరోసారి ఇండస్ట్రీ కి తన స్టామినా ఏంటో చూపించాడు.