ఆస్కార్ కోసం ఏ భాషలో చేసే నటుడు అయినా సరే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత అగ్ర నటుడు అయినా సరే కెరీర్ లో ఒక్కసారైనా ఆస్కార్ గెలవాలి అని పట్టుదలగా పని చేస్తూ ఉంటాడు. మన తెలుగు సినిమాకు కూడా ఇప్పుడు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. త్వరలోనే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఇందుకోసం ఆర్ఆర్ఆర్ టీం అమెరికా వెళ్ళింది.
ఇదిలా ఉంచితే అంత విలువగా భావించే ఆస్కార్ అవార్డుని అసలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అమ్మితే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే… ఆస్కార్ ను తయారు చేయడానికి దాదాపుగా 400 డాలర్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇక మరి అమ్మితే ఎంత వస్తుంది అంటారా…? 1950 కి ముందు ఆర్సన్ వేల్లెస్ అనే అమెరికన్ డైరెక్టర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
అయితే ఆయన ఆస్కార్ అవార్డును వేలం వేయగా 6.5 కోట్లకు అవార్డు కొనుగోలు చేసారు. దీనిపై సీరియస్ అయిన ఆస్కార్ అకాడమీ.ఆస్కార్ అవార్డును అమ్మే అవకాశం లేకుండా ఒక రూల్ తీసుకొచ్చింది. కేవలం ఒక డాలర్ కి మాత్రమే ఆస్కార్ అమ్మాలి అని చెప్పింది. ఈ రూల్ చూపించి ఒక డాలర్‌కే అకాడమీనే అవార్డు కొనే విధంగా రూల్ పెట్టడం విశేషం. కాగా ఆస్కార్ ను 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ , విలియం డెమిలీ మొదలుపెట్టారు.