బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి కి టాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. బాలీవుడ్ హీరోలు కూడా ఆయనతో ఒక సినిమా చేయడానికి కాస్త గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన… మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసారు.

Also Read:దేశ చరిత్రలోనే తొలిసారి.. అమిత్ షా హాజరు..!
ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు ఆయన చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు అయిదేళ్ళ నుంచి ఈ సినిమా కోసం ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. దీనితో ఆయన రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఆయన ఒక్కో సినిమాకు గానూ 24 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. బాహుబలి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన 30 శాతం లాభాలు తీసుకున్నారు. ఈ సినిమాకు కూడా ఆయన అదే విధంగా తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఆయన ఆస్తులు 150 కోట్ల వరకు ఉంటాయని ఖరీదైన బంగ్లాలు కూడా ఉన్నాయట. ఇక ప్రపంచంలోనే ఖరీదైన కార్లు కూడా కొన్నారని తెలుస్తుంది. మూడేళ్ళలో ఆయన ఆస్తులు 40 శాతం పెరిగాయట.