ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. వారి క్రేజ్ ను బట్టి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి వారి సినిమాల కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే 1980లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది.
కాగా అప్పటి స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ ఎంత ? కలెక్షన్ ఎంత వచ్చేవి ఆ వివరాలు ఇప్పటి జనరేషన్ వారికి చాలా మందికి తెలీదు. వారికోసమే ఈ స్పెషల్ ఆర్టికల్.
మొదటిగా సీనియర్ ఎన్టీఆర్, అప్పట్లో ఎన్టీఆర్ సినిమా అంటే 40 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. కమర్షియల్ గా చాలా హంగులు అద్దాల్సి ఉండేదట. ప్రతి సినిమాకు కూడా 12 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఎన్టీఆర్. అప్పట్లో ఇది సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషనట.
రష్మిక రిజెక్ట్ చేసిన 5 హిట్ సినిమాలు ! నిజంగా ఈ సినిమాలలో లేకపోవడం బ్యాడ్ లక్ !
అలాగే మరో హీరో ఏఎన్ఆర్, అప్పటి టాప్ హీరోలలో నాగేశ్వరరావు కూడా ఒకరు. నాగేశ్వరరావు సినిమాకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. ఆ రోజుల్లో పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట ఏఎన్ఆర్.
ఇక మరో హీరో కృష్ణ, కృష్ణ కూడా అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఈయన సినిమాకు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ప్రతి సినిమాకు ఏడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారట కృష్ణ.
ఎన్టీఆర్ తలుచుకుంటే చిరు ఉండేవాడు కాదట!!
సోగ్గాడు శోభన్ బాబు, కృష్ణ సినిమాలతో సమానంగానే శోభన్ బాబు సినిమా బడ్జెట్ కూడా ఉండేదట. ఈయన కూడా ఆరు నుంచి ఏడు లక్షల వరకు బడ్జెట్ ను రెమ్యూనరేషన్ తీసుకునేవారట.
ఇక అప్పటి స్టార్ హీరో సుమన్ కూడా ఆ రోజుల్లో మూడు లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునే వారట. అలాగే సుమన్ సినిమాలకు 17 లక్షల రూపాయల వరకు బడ్జెట్ అయ్యేదట.
ఇక మరో హీరో చిరంజీవి, అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవి సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేదట. అలాగే ఒక్కో సినిమాకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అలాగే పసివాడి ప్రాణం సినిమా తరువాత చిరంజీవి రెమ్యూనరేషన్ పూర్తిగా పెంచేసాడు. అలాగే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలు వారి వారి క్రేజ్ ను బట్టి బడ్జెట్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు.