భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుత సీజనే (2022) తనకు చివరిదని ప్రకటించింది. 35 ఏళ్ల సానియా మహిళల డబుల్స్ టెన్నిస్ విభాగంలో ఎన్నో అద్భుతాలు చేసింది.
భారత్‌కు మరపురాని విజయాలు అందించింది. అంతర్జాతీయంగా 68వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తన కెరీర్ లో సానియా ఇంతవరకు ఎంత సంపాదించి ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఇంతవరకూ తన క్రీడాజీవితంలో మొత్తం 53 కోట్లు సంపాదించింది. 2003లో కెరీర్ ప్రారంభించిన సానియా మీర్జా.. ఒక సింగిల్ టైటిల్, 43 డబుల్స్ టైటిల్స్ ను కైవసం చేసుకుంది.