మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నాడు. అలాగే మరోవైపు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు.

అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బిజినెస్ లో రాణిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని జూ పార్క్ లో ఉన్న జంతువుల సంరక్షణ ఉపాసన స్వయంగా ప్రస్తుతం చూసుకుంటున్నారు. అందుకు సంబంధించి అయ్యే ఖర్చును కూడా ఆమె భరిస్తున్నారు. అంతేకాకుండా 200కు పైగా వృద్ధ, అనాధాశ్రమంలను దత్తత తీసుకొని వారి ఆలనాపాలనా ఉపాసన చూస్తున్నారు.
టూత్ పిక్ పైన ఉన్న అమరికను గమనించారా? అది ఎందుకో తెలుసా ?
అలా కొంత మంది వృద్ధులతో ఇటీవల ఉపాసన గడిపిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉపాసన సంపాదన గురించి చాలామంది కి తెలియదు. అయితే ఆమె ఏడాదికి 30 కోట్ల రూపాయలను సంపాదిస్తారట. అయితే ఆమె సంపాదించిన సంపాదనను సామాజిక సేవ కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
చిన్న హీరోలతోనే పరశురామ్ సినిమాలు చేసుకుంటే మంచిదా ?
కోట్లకు వారసురాలు, మెగాస్టార్ చిరంజీవికి కోడలు అయినప్పటికీ కూడా సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం పట్ల ఉపాసన పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.