తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది సర్వసాధారణం. ప్రతి హీరో, నిర్మాత, దర్శకుడు ఇలా చాలా మంది ఇండస్ట్రీలోకి వారసులను తీసుకొస్తుంటారు. వారితో పాటు వారి బంధువుల పిల్లలకు కూడా సినిమాలపై ఆసక్తి ఉంటే ఛాన్స్ లు ఇస్తూ ఉంటారు. నిజానికి ఒకప్పుడు ఈ వారసత్వం ఉండేది కాదు. కానీ వారసత్వానికి పునాదిరాయి వేసింది మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు అనే చెప్పాలి.
అప్పట్లో ఎస్.వి.రంగారావు లాంటివాళ్ళు ఎంతో అద్భుతంగా రాణించినప్పటికీ వారి వారసులను ఏ మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ మోహన్ బాబు ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదట ఎన్టీఆర్ హరికృష్ణ ను హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత బాలకృష్ణను పరిచయం చేశారు. మరో ఇద్దరు కొడుకులను నిర్మాణ రంగంలోకి దించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అవేమీ పట్టించుకోకుండా టాలెంట్ ఉన్న వాళ్ళు నిలబడతారని లేదంటే లేదని ఎన్టీఆర్ చెప్పారు.
త్వరలో హీరో రామ్ పెళ్లి ! అమ్మాయి ఎవరో తెలుసా ?
అయితే ఏఎన్ఆర్, కృష్ణ లాంటి వారు ఇండస్ట్రీకి అప్పటివరకు వారసులను పరిచయం చేయలేదు. ఏఎన్ఆర్ వారసుడు నాగార్జున ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి వ్యాపార రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ వారసులను తీసుకురావటంతో ఏఎన్ఆర్ కూడా తీసుకు రావడం జరిగింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ… రమేష్ బాబు ను హీరోగా తీసుకొచ్చారు. రమేష్ బాబును హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి రమేష్ బాబు సినిమాలకు దూరం అయ్యాడు.
శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?
అయితే రెండవ కుమారుడు మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. నాగార్జున కూడా మరో వైపు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత నాగర్జున వారసులుగా నాగచైతన్య అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా మీరంతా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఒక రకంగా ఎన్టీఆర్ కారణమని చెప్పొచ్చు.