తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడితే అందులో ఎన్టీఆర్ పేరు మొదట వినపడుతుంది. ఆయన సాధించిన విజయాలు, రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అగ్ర దర్శకులు, నిర్మాతలు ఎందరో ఆయనతో సినిమా చేయడానికి ఎదురు చూసేవారు. ఇక ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేసారు. అయితే ఆయన నిర్మాతగా ఎలా మారారో చూద్దాం.
ఎన్టీఆర్ నిర్మించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ కాగా… ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఎన్టీఆర్ నిర్మాతగా మారడానికి కి ఓ చిన్న కారణం ఉంది. ఆయన తమ్ముడు త్రివిక్రమ్ రావు సంగీత పర్యవేక్షకుడిగా.. నిర్మాతగా బాధ్యతలు నిర్వహించే వారు. ఎన్టీఆర్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమాను త్రివిక్రమ్ రావు స్వయంగా నిర్మించారు.
కాని ఆ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ వేరు… తర్వాత పెరిగిన బడ్జెట్ వేరు. దీనితో అధిక వడ్డీకి వాహిని సంస్థ ద్వారా అప్పు తీసుకు రావడానికి సిద్దమయ్యారు. అయితే ఆ సంస్థ మాత్రం అప్పు ఇవ్వలేం గాని… సహనిర్మాణ బాధ్యతలు తీసుకుంటామని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. ఆ విధంగా చేస్తే లాభాల్లో వాటా అడుగుతారు. దీనితో ఆయన నో అనేసారు. ఇది ఎన్టీఆర్ కు చెప్తే పరిష్కారం దొరుకుతుందని భావించిన ఆయన ఎన్టీఆర్ వద్దకు వెళ్ళారు. అప్పటికే ఎన్టీఆర్ కు ఈ విషయం తెలవడంతో వాహిని సంస్థతో మాట్లాడి డబ్బులు ఇప్పించారు. అక్కడి నుంచి ఏ సినిమా చేసినా త్రివిక్రమ రావు… ఎన్టీఆర్ పేరునే వాడేవారు.