హీరో రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో రాజశేఖర్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాజశేఖర్ సినిమాలు రావట్లేదు. ఇదిలా ఉండగా చిరంజీవి రాజశేఖర్ మధ్య గతంలో ఓ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే .
మీడియా ముఖంగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఎన్నో అభిప్రాయబేధాలు వచ్చాయి. ఆ తరువాత మాత్రం ఈ ఇద్దరూ కలిసి పోయారు. అందుకు కారణం రాజశేఖర్ కూతురు శివానిఅట. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ చెప్పారు. చిరంజీవి తో విభేదాలు వచ్చాక కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నామని అప్పుడప్పుడు కలిసినప్పటికీ మనస్ఫూర్తిగా ఏ రోజు కూడా మాట్లాడుకో లేదని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడంటే..?
అయితే ఓసారి తన కూతురు శివాని మెడికల్ సీటు కోసం అపోలో కాలేజీలో దరఖాస్తు చేశామని, ఇదే విషయం పై జీవిత చిరంజీవి దగ్గరకు వెళ్ళిందని చెప్పారు. అయితే నా భార్య జీవిత వెళ్లాక చిరంజీవి నా గురించి అడిగారని, రమ్మనమని చెప్పారని కానీ తాను వెళ్లలేదని చెప్పుకొచ్చారు రాజశేఖర్.
మొదట జీవిత ఫోన్ చేసినప్పుడు నేను వెళ్లలేదని కానీ ఆమె ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లిందని ఆ సమయంలో చిరంజీవి తనను రిసీవ్ చేసుకున్న తీరు మొత్తం మార్చేసిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసిపోయారు.
ఆర్ఆర్ఆర్ లో రాజమౌళికి నచ్చింది ఏంటి?
ఇక రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్, అలాగే బాబీ తో ఓ సినిమా చేయబోతున్నాడు.