హ్యాపీ డేస్… ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇంజినీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి క్రేజ్ లభించింది. స్టూడెంట్స్ అంతా కూడా ఈ సినిమాను చూసేందుకు క్యూలు కట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్, వరుణ్ సందేశ్, తమన్నాతో పాటు మరికొంతమంది లీడ్ రోల్లో నటించారు.
వీరితో పాటు అప్పు క్యారెక్టర్ లో ఒక అమ్మాయి నటించింది. నిఖిల్ ని లవ్ చేస్తూ… ఆటపట్టిస్తూ అప్పు పాత్ర ఉంటుంది. కాగా అప్పు క్యారెక్టర్ చేసిన అమ్మాయి అసలు పేరు గాయత్రిరావు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్ చిత్రాలలో నటించింది గాయత్రి రావు. ఆ తర్వాత తమిళంలో కూడా ఒకటి రెండు సినిమాలు చేసి 2019లో పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న గాయత్రి రావు ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేని విధంగా తయారయింది. ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని గడుపుతున్న గాయత్రిరావు అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. ఇక గాయత్రిరావు తల్లి పద్మ, తండ్రి అరుణ్ కుమార్ లు కూడా సినీ ఇండస్ట్రీ లోనే ఉండటం గమనార్హం.
ALSO READ : పవన్ మూడో భార్య ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
తల్లి పద్మ హ్యాపీ డేస్ సినిమా లో నిఖిల్ కు అమ్మ గా నటించింది. దీనితో పాటు చాలా సినిమాల్లో నటించారు పద్మ. తండ్రి అరుణ్ కూడా చాలా చిత్రాలలో నటించాడు. నిజానికి పెళ్లి తర్వాత గాయత్రిరావు కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తోంది.
ALSO READ : మహేష్ ఫాన్స్ ను భయపెడుతున్న జగన్