చేసింది ఒకటి రెండు సినిమాలు… అయినప్పటికీ కూడా వారు చైల్డ్ ఆర్టిస్ట్ లు గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత తెరపై ఎక్కడా కూడా కనిపించలేదు. అలా సినిమాల్లోకి వచ్చి ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు పెర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. అయితే వారు ఎవరు… ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం.
మొదటిగా కావ్య… 1996లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాలో ఐ యామ్ ఏ గుడ్ గర్ల్ పాటతో ఫేమస్ అయిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ అమ్మాయి పూర్తి పేరు కావ్య అన్నపరెడ్డి. అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. పెద్దయిన తర్వాత కూడా సినిమాల్లో నటించలేదు. నిర్మాత గుణ్ణం గంగరాజు మేనకోడలు కావ్య. ప్రస్తుతం ఈమె డాక్టర్ గా స్థిరపడ్డారు.
నాగ అన్వేష్… ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ కొడుకు గా నటించాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. అక్కడ తో మరి కనిపించలేదు. ఇప్పుడు హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. వినవయ్య రామయ్య, ఏంజెల్ సినిమాలలో హీరోగా నటించాడు. అవి సక్సెస్ కాకపోవడంతో కనిపించలేదు ఎక్కడ కనిపించలేదు.
అనుష్క మల్హోత్రా… మెగాస్టార్ చిరంజీవి సిమ్రాన్ జంట గా నటించిన డాడీ సినిమాలో అక్షయ పాత్రలో చిరంజీవి కూతురు గా నటించింది. అప్పట్లో ఈ సినిమాలో చిరంజీవి కూతురు గా నటించడానికి ఒక ఆడిషన్ నిర్వహించారు. వందల మంది పాల్గొన్నారు. ఆఖరికి అనుష్క ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు పెరిగి పెద్దయిన ఈ అమ్మడు చాలా క్యూట్ గా తయారైంది. ఆమె ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ALSO READ : కేజీఎఫ్ 2 కు డబ్బింగ్ చెప్పింది వీళ్ళే !! వీళ్ళు లేకపోతే అంతే
శ్వేత యామిని… జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించింది శ్వేత యామిని. ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించింది. శ్వేత యామిని పాత్రకి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కూడా చేసుకుంది. కానీ ఈ సినిమా తర్వాత సినిమాల్లో నటించలేదు.
ALSO READ : కొండవీటి సింహం సినిమా నుంచి చిరును తీసేశారట!! ఎందుకో తెలుసా ?
మరో నటి బకిత… ఆనంద్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి బకిత. ఈ ఒక సినిమాలోనే నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు.
భష్వంత్ వంశీ… చత్రపతి సినిమాలో సూరీడు పాత్రలో నటించాడు వంశీ. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. వంశీ కి మంచి పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవలే ఓ సినిమాలో కూడా నటించాడు వంశీ.