సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు రెండు. ఒకటి అతడు,రెండు ఖలేజా. అయితే ఇందులో అతడు విషయానికొస్తే థియేటర్స్ లో అంతగా హిట్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత టీవీల లో మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకుంది.
ఇప్పటికీ కూడా టీవీ లో ఈ చిత్రం ప్రసారం అయితే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్, మహేష్ బాబు యాక్షన్, మణిశర్మ సంగీతం, అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్ గా నటించింది.
అక్కినేని నాగ చైతన్య వదులుకున్న హిట్ ఫ్లాప్ సినిమాలు ఇవే !!
అలాగే నాజర్, హేమ, సుధా, గిరిబాబు, సునీల్, కీలక పాత్రలో నటించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గా ఒక బుడ్డోడు నటించాడు. ఆ బుడ్డోడు బ్రహ్మానందం రాగానే నా కోసం ట్రైన్ తెచ్చావా నాన్న అని అడుగుతాడు. రైల్వే స్టేషన్ లో ఉంది తెచ్చుకో పో అంటాడు బ్రహ్మానందం ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా అందరికీ నవ్వు తెప్పిస్తుంది.
బాలయ్య నో చెప్పిన కథతో రికార్డ్స్ బ్రేక్ చేసిన మోహన్ బాబు.. ఆ సినిమా ఇదే !!
అయితే ఆ బుడ్డోడు ఇప్పుడు హీరో అయిపోయాడు. అతనిని చూసిన చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. ఆ బుడ్డోడి అసలు పేరు దీపక్. దీపక్ అతడు సినిమా తర్వాత ఆర్య, లెజెండ్, పెద్దబాబు, ఆంధ్రుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. వందనం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే మిణుగురులు అనే చిత్రంలో ముఖ్య పాత్రలో కూడా నటించాడు దీపక్.