కళా తపస్వి కే విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఆయన స్థాయిని ఎక్కడికో తీసుకు వెళ్తే, ఆయన నటించిన సినిమాలు ఆ సినిమాల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తెలుగు ప్రేక్షకులతో పాటుగా బాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించారు. హీరోయిన్ ను ఆయన చూపించే విధానం ఒక రేంజ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే.
హీరోయిన్ పాత్రను ఆయన తీర్చి దిద్దిన విధానం విమర్శకుల ప్రసంశలు అందుకుంది అనే మాట వాస్తవం. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేస్తే వాళ్ళను వాళ్ళు ఎంతో మార్చుకునే వారు అనే విషయం తెలిసిందే. కమల్ హాసన్ లాంటి నటుడ్ని కూడా ఆయన తన సినిమా కోసం మార్చేసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉంచితే ఆయన ఆస్తులు ఎంత అనే దాని మీద చిన్న సందేహం ఉంది చాలా మందిలో.
నటుడిగా దర్శకుడిగా ఆయన ఎన్నో సినిమాలు చేసారు. ఒకసారి ఆయన ఆస్తులు చూస్తే విశ్వనాథ్ కు జూబ్లీహిల్స్ లో సుమారు 12 కోట్ల విలువచేసే ఇల్లు ఉందని టాక్. అలాగే హైదరాబాద్ శివారులో దాదాపు 8 ఎకరాల పొలం ఉందని అంటారు. ఇద్దరు కుమారులు ఒక కుమార్తెకు ఆస్తులు సమానంగా పంచారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా ఆస్తులు ఇచ్చారు. మొత్తం 130 కోట్ల ఆస్తిని ముగ్గురికి సమానంగా రాసారు.