విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ తో ప్రేక్షకులను ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా OTT హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఒక ప్రముఖ OTT సంస్థ లైగర్ కోసం రూ.65 కోట్లు చెల్లించిందట. నిజానికి దక్షిణ భారత సినిమాలో ఇదే అతిపెద్ద OTT డీల్ అని చెప్పాలి. దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ముంబై వీధుల్లో తిరిగే యువకుడు ఫైటర్‌గా ఎదిగి అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎలా మారాడు అన్నదే ఈ కథ.
ఆగస్ట్ 25న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే, రోనిత్ రాయ్, రమ్యకృష్ణ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.