కొంతమంది అగ్ర హీరోలతో పని చేసినా మీడియాలో మాత్రం వాళ్లకు అంత క్రేజ్ ఉండదు. చాలా మంది అగ్ర హీరోలకు పని చేసిన వారిని ఫాన్స్ కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వ్యక్తే ముక్కు రాజు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ కూడా డాన్స్ నేర్పిన వ్యక్తి. అయినా సరే ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఇక చిరంజీవికి కూడా ఆయన పని చేసి కెరీర్ ప్రారంభంలో డాన్స్ మాస్టర్ గా పని చేసారు.
ఆయన గురించి ఒకసారి చూద్దాం. 1931లో భీమవరం దగ్గరలో ఉన్న కుముదవల్లిలో వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1941లో పుస్తకాలను విసిరేసారు. కె.వి రెడ్డి 1955లో తీసిన మాయాబజార్ సినిమాతో మొదటిసారిగా సినిమాల్లో నటించారు ఆయన. కెరీర్ లో దాదాపు దాదాపు 500 సినిమాలు చేసారు. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు.
చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్లు, మన ఊరి పాండవులు సినిమాలకు డాన్స్ మాస్టర్ గా చేసారు. ఇక ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపించారు. తెలంగాణా భావజాలంతో వచ్చిన సినిమాల్లో ఆయన ఎక్కువ కనిపించారు. 2014 లో జూలై 31వ తేదీన ముక్కు రాజు కన్నుమూసారు. నటన పరంగా కూడా ఆయనకు మంచి ఇమేజ్ వచ్చింది.