అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీ అవుతున్నారు. ఆయన వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పవన్ చేతిలో ఉన్న రెండు సినిమాలు ఈ ఏడాది ఒక సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పవన్ కెరీర్ లోనే కాస్త భిన్నమైన సినిమా. దీనితో ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడటమే కాకుండా బరువు కూడా తగ్గారని అంటున్నారు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ దాదాపుగా 70 కోట్ల వరకు తీసుకుంటున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక సుజిత్ సినిమా కోసం గాను పవన్ కళ్యాణ్ రోజుకి మూడు నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని సమాచారం.
అలాగే మరో సినిమా కూడా లైన్ లో ఉంది. హరీష్ శంకర్ తో ఒక సినిమాను పవన్ ప్లాన్ చేసారు. ఈ సినిమా కథ కూడా ఇప్పటికే సిద్దం కావడం కొంత షూట్ కూడా పూర్తి చేసారు అని టాక్ రావడం జరిగింది. ఈ సినిమాకు పవన్ 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే పవన్ ఇలా భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.