తెలుగు సినిమా ప్రేక్షకులు మర్చిపోలేని హీరోయిన్ రాశీ. హీరోయిన్ గా ఆమె స్టార్ హీరోల పక్కన మంచి సినిమాల్లో నటించింది. అలాగే నెగటివ్ పాత్రల్లో కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమా పరిశ్రమకు దూరం కాకుండా బుల్లి తెర మీద కనపడే ప్రయత్నం చేస్తుంది. యువ హీరోలకు తల్లిగా కూడా నటించే అవకాశం ఉందని టాక్ ఉంది సోషల్ మీడియాలో.
ఇదిలా ఉంచితే ఆమె ఆస్తులకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. సినిమా రంగంలో రాణించిన ఆమె బాగానే సంపాదించుకుంది. 80 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాశీ… 5000 రూపాయల రెమ్యునరేషన్ తో కెరీర్ మొదలుపెట్టారు. ఆమె ఆస్తుల విలువ 20 కోట్ల వరకు ఉందని టాక్. ఈ సంపాదనను ఆమె రియల్ ఎస్టేట్ మీద పెట్టి ఫ్లాట్స్ కొనుక్కున్నారు అని అంటున్నారు.
ఇక ఆమెకు కార్లు అంటే చాలా ఇష్టం అని… అందుకే ఖరీదైన కార్లు కూడా కొనుక్కున్నారు అని టాక్. ఇక హైదరాబాద్ లో రిచ్ ఏరియా గా చెప్పుకునే జూబ్లీహిల్స్ లో రాశి ఖరీదైన అపార్టుమెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నారు. దాని విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. 42 ఏళ్ళ రాసి… విజయవాడలో పుట్టి ఆ తర్వాత చదువుల కోసం చెన్నై వెళ్లి అక్కడే సినిమాల్లోకి అడుగు పెట్టారు.