తెలుగు ప్రేక్షకులు సావిత్రి తర్వాత ఆ స్థాయిలో మర్చిపోలేని పేరు సౌందర్య. ఆమె ఎన్నికల ప్రచారం కోసం కోసం వెళ్తూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రి సత్యనారాయణ సహకారంతో సినిమాల్లోకి వచ్చిన ఆమె తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. తన పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక ఆమె తండ్రి స్వతహాగా రైటర్ అలాగే నిర్మాత. ఆయన కన్నడంలో కొన్ని సినిమాలు చేసారు.
సౌందర్య సోదరుడు అమర్ నాథ్ కూడా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. ఆమెకు ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందేవి అంటారు. కాని సౌందర్యతో పాటుగా ఆయన కూడా మరణించారు. సౌందర్య కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆమె తండ్రి ప్రాణాలు కోల్పోయారు. ఇక తన తండ్రి కోసం ఒక సినిమా చేయాలని భావించిన సౌందర్య… అందుకోసం ఒక సినిమా పూర్తి చేసారు.
1999లో ఒక కథ రెడీ చేసుకుని మూడేళ్ళ టైం తీసుకుని ద్వీప అనే పేరుతో సినిమా చేసారు. పూర్తిగా కన్నడంలో ఈ సినిమా చేయగా అక్కడ మంచి హిట్ అయింది. వరుసగా మంచి అవార్డులు వచ్చాయి. ఫిలిం ఫేర్ తో పాటుగా 14 అవార్డులు రావడం గమనార్హం. సౌందర్య ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా కూడా ఆమె నటించడం విశేషం.