సినిమాలో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రకు న్యాయం చేసే నటుడు ప్రకాష్ రాజ్. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు అన్నీ ఇన్ని కాదు. ఏ పాత్ర ఇచ్చినా సరే ఆయన మినహా ఎవరూ చేయలేరు అన్నట్టుగా ఆమె నటించింది. ప్రకాష్ రాజ్ కెరీర్ ఇప్పుడు కాస్త రాజకీయాల కారణంగా వెనకడుగు వేసినా ఆయన మాత్రం కాస్త దూకుడుగానే తమిళ సినిమాల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగులో ఆయన రవితేజా చేసిన దాదాపు అన్ని సినిమాల్లో నటిస్తారు. రవితేజా హీరోగా నిలబడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలు ఆయనకు బాగా ప్లస్ అయ్యాయి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఈడియట్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ పాత్రలే హైలెట్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ కోసమే ఆ పాత్రలు డిజైన్ చేసారు. ఇక ప్రకాష్ రాజ్… రవితేజా సినిమాల్లో మూడు రకాల కీలక పాత్రలు చేసారు.
ఖడ్గం సినిమాలో ఫ్రెండ్ గా నటించారు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో తండ్రిగా నటించారు. ఈడియట్ సినిమాలో హీరోయిన్ కు తండ్రిగా అంటే మామగా నటించారు. ఈ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి అప్పట్లో. ఖడ్గం సినిమాలో విలక్షణంగా నటించారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ త్వరలోనే ఒక సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉంది అని ఆ సినిమాకు ఆయనే నిర్మాత అని సమాచారం.