మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో మకుటం లేని మహారాజుగా నిలిచారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. చిరుత సినిమాతో పరిచయం అయిన రామ్ చరణ్ మగధీర, రంగస్థలం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అలాగే సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఆర్సీ15 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా చరణ్ రాణిస్తున్నాడు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని చరణ్ వివాహం చేసుకున్నాడు. అయితే ఉపాసన, రామ్ చరణ్ దారులు వేరైనప్పటికీ అభిరుచులు ఒకటి కావడంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
Advertisements
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే రామ్ చరణ్ నాలుగేళ్లు చిన్నవాడు. అయినప్పటికీ కూడా ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక ఇటీవలే 10 కోట్ల రూపాయలతో ఓ మంచి ఇంటిని నిర్మించుకున్నారు ఈ ఇద్దరూ. ప్రస్తుతం అక్కడే చరణ్ ఉపాసన నివాసం ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన అభిమానులతో టచ్ లో ఉంటూ హెల్త్ టిప్స్ చెబుతూ ఉంటారు.