సీనియర్ నటుడు నరేశ్ నాలుగో పెళ్ళి నిమిత్తం నడుస్తున్న వివాదానికి శాశ్వతంగా తెరపడనుంది. ఆస్తుల విషయం కొలిక్కివస్తే…అనుంబంధాల వివాదం వాటంతటవే చక్కబడతాయని పలువురు చెవులు కొరుక్కుంటున్న నేపథ్యంలో ఈ వార్త బైటకు రావడం శుభపరిణామమని పలువురు భావిస్తున్నారు.
నరేశ్ నాలుగో పెళ్ళి వార్తలు బయటకు పొక్కడంతో అతని మూడో భార్య.. రమ్య రఘుపతి రంగంలోకి దిగినవిషయం తెలిసిందే. నరేష్, పవిత్ర లోకేష్ ఓ హోటల్లో ఉంటే అక్కడికి సైతం రమ్య వెళ్లి గొడవ చేసారు. దీంతో అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి నరేష్, పవిత్ర లోకేష్ ని అక్కడి నుండి పంపేశారు.
ఇక అప్పటినుండి బయట ఎక్కువగా కనిపించని ఈ జంట తాజాగా.. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి లిప్ లాక్ వీడియోని షేర్ చేసి.. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అఫీషియల్ గా ముక్కుమీద వేలేసుకునేంత క్లారిటీ ఇచ్చారు.
అయితే నరేష్ మళ్ళీపెళ్ళికొడుకు కాబోతున్న నేపథ్యంలో మరి మూడో భార్య రమ్య రఘుపతి పరిస్థితి ఏంటి అని చాలామంది భావించారు. ఈ నేపథ్యంలోనే రమ్యా రఘుపతికి, నరేష్ విడాకులు ఇచ్చి భరణం కూడా ఇవ్వబోతున్నారట.
నరేష్ తన మూడవ భార్యకి భరణం కింద ఐదు కోట్ల రూపాయల ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం కేవలం ఐదు కోట్లకే రమ్య రఘుపతి ఎలా ఒప్పుకుంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నరేష్ కి సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు వీరి వ్యవహారం పై స్పందించారు. రమ్య రఘుపతి, నరేష్ విడాకుల విషయం కోర్టులో పూర్తి అయిందని.. ఆమెకు భరణం కింద ఎంత ఇవ్వాల్సి వచ్చినా తాను ఇస్తానని నరేష్ తెలిపినట్లు చిట్టిబాబు వెల్లడించారు.
నరేష్ కు తన తల్లి విజయనిర్మల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయి. అందుకే తాను కోట్లలో భరణం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని చిట్టిబాబు తెలిపారు. రమ్య రఘుపతి కుమారుడికి నరేష్ తల్లి ఇచ్చిన ఆస్తిలో వాటా ఉంటుందని, నరేష్ కష్టార్జితం విషయంలో అలా ఉండదని చిట్టిబాబు ఈ సందర్భంగా తెలిపారు.