మన తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో తమిళంలో విజయ్ కి కూడా దాదాపు అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. అతను రాజకీయాల్లోకి కూడా వచ్చే ప్రయత్నాలు చేసినా సరే అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక సినిమాల మీద విజయ్ ఫోకస్ చేసి వరుసగా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తున్నాడు. ఇటీవల నటించిన వారసుడు సినిమా వసూళ్లు బాగానే వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చింది.
ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తర్వాత కొన్ని భారీ ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టె ఆలోచనలో ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ తో ఒక సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకు విక్రం సినిమాకు లింక్ పెట్టే ఆలోచనలో లోకేష్ ఉన్నాడు అని టాక్. విజయ్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసాడు.
వారసుడు సినిమాకు వంద కోట్ల వరకు తీసుకున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక విజయ్ ఆస్తుల విషయానికి వస్తే నికర ఆస్తుల విలువ 445 కోట్ల వరకు ఉందని టాక్. ఆయన సినిమాలు గతంలో బాగా ఆడేవి. దీనితో నిర్మాతలు లాభాల్లో వాటా కూడా ఇచ్చేవారు. ఇప్పుడు విజయ్ కెరీర్ కాస్త డేంజర్ లో ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేసే అవకాశం ఉంది.