జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ ఆర్. మార్చి 25న భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు.
అలాగే ఆలియాభట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, శ్రీయ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మల్లి పాత్రలో నటించిన ట్వింకిల్ నటన అందర్నీ ఆకట్టుకుంది.అలాగే ఈ సినిమాలో మల్లి పాడిన కొమ్మ ఉయ్యాల, కోన ఉయ్యాల పాట హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన వారంతా కూడా మల్లి పాత్రలో నటించిన ట్వింకిల్ తో పాటు కొమ్మ ఉయ్యాల, కోన ఉయ్యాల పాట పాడిన అమ్మాయి గురించి కూడా ఆరా తీయడం మొదలు పెట్టారు.
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఒకవైపు చిరు, మరోవైపు బాలయ్య ఫొటోస్ ఉంటాయట ఎందుకంటే ?
అయితే కొమ్మ ఉయ్యాల, కోన ఉయ్యాల అంటూ అంత అద్భుతమైన పాట పాడిన అమ్మాయి పేరు ప్రకృతి రెడ్డి. 2010లో కర్ణాటక లో ప్రకృతి రెడ్డి జన్మించింది. సంగీతంపై ఆసక్తి ఉండడంతో తల్లిదండ్రులు చదువుతోపాటు సంగీతంలో కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
సినిమాల్లోకి రాక ముందు మన టాప్ హీరోయిన్స్ పేర్లు ఏమిటో తెలుసా ?
ఎన్నో సింగింగ్ కాంపిటేషన్ కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలను అందుకుంది ప్రకృతి రెడ్డి. ఒక్క తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ, భాషల్లో కూడా ఎన్నో పాటలు పాడింది.
తెలుగు లో పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రకృతి తన పాటతో గతంలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రశంసలను అందుకుంది. అలాగే శంకర్ మహదేవన్ ప్రశంసలను కూడా గతంలో అందుకుంది ప్రకృతి రెడ్డి.
Advertisements
తన టాలెంట్ తో ఆర్ఆర్ ఆర్ లో కూడా పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాట తో మరోసారి ప్రకృతి రెడ్డి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.