ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోయాయి. అయితే టిక్ టాక్ ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్న వారు తెరపైకి వచ్చారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోయారు. అందులో దుర్గారావు కూడా ఒకరు.
తన భార్యతో కలిసి డాన్సులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశాడు దుర్గా రావు. దీంతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. తక్కువ సమయంలోనే 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుని సినిమాలలో కూడా అవకాశాలు అందుకుని ఫుల్ బిజీ అయిపోయాడు.
పవన్ మూడో భార్య ఆస్తులు విలువ తెలుసా? షాక్ అవ్వాల్సిందే!
ముఖ్యంగా భార్యతో కలిసి చేసిన నాది నక్కిలీసు గొలుసు పాటతో ఫుల్ ఫేమస్ అయ్యారు దుర్గారావు. దుర్గారావు కు టీవీ షోలలో కూడా అవకాశం వచ్చింది అంటే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గా రావు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించానని… కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడినని తెలిపారు. ఆ తరువాత తన మేనల్లుడు సహాయంతో టిక్ టాక్ వీడియోలు చేయడం తెలుసుకొని అలా అందరికీ పరిచయం అయ్యానని తెలిపారు.
చిరు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అర్జున్ ఎలా ఉన్నాడో తెలుసా?
అలాగే తాను కేవలం రెండవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని చెప్పారు. ఇక ప్రస్తుతం దుర్గారావు వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నాడు.
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా ?