ఇప్పుడు ఆస్కార్ సందడి మన దేశంలో కూడా కాస్త హడావుడిగా కనపడుతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆస్కార్ మాట వినపడుతుంది. చరిత్రలో తొలిసారి ఆస్కార్ అవార్డుని సాధించింది రాజమౌళి సినిమా. ఈ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే మరో ఇండియన్ డాక్యుమెంటరి కి కూడా అవార్డు ఇచ్చారు.
ఇదిలా ఉంచితే ఆస్కార్ కి సంబంధించిన అనేక విషయాలు వైరల్ గా మారాయి. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన వారికి ఏమైనా గిఫ్ట్ ఇస్తారా అనేది చాలా మందికి డౌట్ ఉంది. అవును కచ్చితంగా ఖరీదైన బహుమతులు ఇచ్చి పంపిస్తారు. దానికి కారణం ఏంటీ అంటే… ఆస్కార్ వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. రాకపోతే బాధ పడే అవకాశం ఉంటుంది.
అందుకే లక్షా 20 వేల డాలర్ల విలువ చేసే బహుమతులు ఇస్తారట. ఒక బ్యాగ్ లో దాని విలువ చేసే అవార్డులు ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కూడా కల్పిస్తారు. కాస్మెటిక్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటే చేసుకోండి అని కొంత నగదు కూడా ఇస్తారు. 8 మంది నామినీస్ మూడు రాత్రులు ఇటాలియన్ లైట్ హౌస్ లో గడిపే అవకాశం కల్పించారు. డైరెక్టర్, యాక్టర్, యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ కు మాత్రమే ఈ అవకాశం ఉంది.