వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా ఇప్పుడు మళ్ళీ గాడిలో పడ్డాడు రవితేజ. అగ్ర హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు సూపర్ హిట్ కావడంతో రవితేజా కెరీర్ ఇప్పుడు మళ్ళీ స్పీడ్ గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వచ్చే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది రెండు రానున్నాయి అని టాక్.
చిన్న నటుడి నుంచి మాస్ హీరోగా అతను పైకి వచ్చిన విధానం చాలా ఆసక్తిగా ఉంటుంది. పూరి జగన్నాథ్ తో చేసిన సినిమాలు అతని కెరీర్ కి బాగా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకి ధమాకా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా ఫాన్స్ కి కూడా అతను బాగా దగ్గరయ్యాడని చెప్పాలి.
ఇక రవితేజా ఇన్నేళ్ళ కెరీర్ లో బాగానే ఆస్తులు సంపాదించాడు అని చెప్పాలి. అతని ఇల్లు ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు అందరూ. 12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఆయన ఉంటున్నారు. రవితేజా గురించి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో హీరోగా నటించిన కమల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. కెరియర్ మొదట్లో తాను హైదరాబాదులో తనకు ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలని అనుకున్నారట. కాని ఇప్పుడు అంత ఖరీదు చేసే ఇంట్లో రవితేజా ఉంటున్నారని చెప్పాడు.