తన పర్సనల్ లైఫ్ కంటే కూడా కెరీర్ ముఖ్యం అని అంటుంది సమంతా. అందుకే ఏ ఆఫర్ వచ్చినా సరే నో అనకుండా అడుగులు వేస్తూ సినిమాలు చేస్తుంది. నాగచైతన్య తో విడాకుల వ్యవహారం తర్వాత ఆమె కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు అనే టాక్ ఉంది. ఇప్పుడు వెబ్ సీరీస్ లతో పాటుగా తమిళం, బాలీవుడ్ సినిమాలను వెంటనే సైన్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వచ్చే ఏడాది ఆమె నటించే సినిమాలు ఏకంగా ఆరు విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఒక పక్కన వ్యాధితో బాధ పడుతున్నా సరే సమంతా వెనకడుగు వేయడం లేదు. ఒక స్టార్ హీరో నిర్మించే వెబ్ సీరీస్ లో ఆమె కీలక పాత్రలో కనపడే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఈ తరుణంలో ఆమె కాస్త ఇళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు.
అద్దెలకు హోటల్స్ కి ఎక్కువగా ఖర్చు చేయకుండా ఏకంగా ఇల్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇల్లు కొంటే తనకు ఉంటుందని తర్వాత అమ్ముకోవచ్చు అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ముంబై లో ఒక ఇల్లు కొనేసింది అని సమాచారం. 15 కోట్ల ఖర్చు చేసే ఇంటిని ఆమె కొనుగోలు చేసారు. ఆ ఇంటికి ఇంకొంచెం ఖర్చు ఉందని అయినా సరే సమంతా వెనకడుగు వేయడం లేదని టాక్.