తెలుగు సినిమాలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నా… ఒకప్పుడు వరుస విజయాలతో చిరంజీవి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల సినిమాలు చేసిన చిరంజీవి… మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
వసూళ్ళ పరంగా కూడా కొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే చిరంజీవికి కార్లు అంటే చాలా ఇష్టం. ఇన్నేళ్ళ తన కెరీర్ లో ఆయన ఎన్నో ఖరీదైన కార్లు కొనుగోలు చేసారు. అందులో అరుదైన కార్లు కూడా ఉన్నాయి. అసలు ఆయన గ్యారేజ్ లో ఉన్న కార్లు ఏంటో చూద్దాం. ఖరీదైన కార్ గా చెప్పుకునే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు చిరంజీవి కొనుగోలు చేసారు.
అలాగే టొయోటా లాండ్ క్రూయిజర్ కారు కూడా ఆయనకు ఉంది. అవి మాత్రమే కాకుండా మెర్సెడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారును కూడా ఉంది. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్ వోగ్ కారును కూడా ఆయన కొన్నారు. అలాగే తాను మొదట కొన్న కారు కూడా దాచుకున్నారు. ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళాలి అనుకుంటే స్వయంగా తానే ఆ కారు నడుపుకుని వెళ్తారట.