ఈ రోజుల్లో సినిమా అంటే వంద కోట్లు అనే మాట వినపడుతుంది. అప్పట్లో సినిమా అంటే వంద రోజులు ఆడాలి అని దర్శకుల నుంచి ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేసేవాళ్ళు. సినిమా హీరోలు, దర్శకుల కెరీర్ దాని మీదనే ఆధారపడి ఉండేది. అందుకే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు అప్పట్లో. కథలో పట్టున్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరించే వారు అనే మాట వాస్తవం.
Also Read:ఫిదా కథ అసలు ముందు ఎవరు విన్నారో తెలుసా…?
వంద రోజుల సినిమాల విషయంలో హీరోల మధ్య పోటీ కూడా ఉండేది. ఫ్యాన్ వార్ లు కూడా భారీగా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయనే మాట వాస్తవం. అసలు మన తెలుగులో మొదటి వంద రోజుల సినిమా ఏదీ అనే విషయం చాలా మందికి తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన బాలరాజు అనే సినిమా వంద రోజులు ఆడింది. 1948వ సంవత్సరం లో ప్రతిభ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది.
ఘంటసాల బలరామయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. విజయవాడలో ఏడాది పైగా ఆడింది. మరో 12 కేంద్రాలలో 200 రోజులకు పైగా ఆడింది ఈ సినిమా. 100 రోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహించారు. 100 రోజుల వేడుకలు జరిపే సాంప్రదాయానికి ఈ సినిమాతోనే మొదలయింది. ఆగస్టు 16న ఏలూరులో 25 వారాల వేడుక జరుపుకుంది. తొలి రజతోత్సవ చిత్రం కూడా ఇదే.
Also Read:మీడియా ముందే సీఎస్ కు ఎమ్మెల్యే ఫోన్!