వీరసింహ రెడ్డి సినిమాతో గోపిచంద్ మలినేనికి టాలీవుడ్ లో కాస్త క్రేజ్ పెరిగింది అనే కామెంట్స్ వినపడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయనే కామెంట్స్ వింటున్నాం. ఇక తాజాగా గోపిచంద్ మలినేని కీలక వ్యాఖ్యలు చేసారు. తన మొదటి రెమ్యునరేషన్ కేవలం వెయ్యి రూపాయలని ఆయన చెప్పుకొచ్చాడు. పోలీస్ అనే సినిమాకు తనకు ఆ రెమ్యునరేషన్ ఇచ్చారని అన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమాలో కావాలని డైలాగులు పెట్టలేదు అన్నారు. కడపలో వీరసింహారెడ్డి ఈవెంట్ చేయాలని అనుకున్నామని, అయితే కర్నూలులో అప్పటికే ఈవెంట్ చేయడంతో ఒంగోలులో ఈవెంట్ చేశామని చెప్పారు. మా సినిమాకు అయిన బడ్జెట్ ప్రకారమే టికెట్ రేట్లు పెంచారని తెలిపారు. వీరసింహారెడ్డి డైలాగ్స్ విషయంలో కావాలని ఏం చేయలేదని స్పష్టం చేసారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని నేను భావిస్తానని చెప్పుకొచ్చారు. బాలయ్య సినిమా అంటే డైలాగ్స్ ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారని అన్నారు. చిరంజీవి సినిమాకు కూడా పని చేయాలని ఉందని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నానని అన్నారు. ఆయన అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు అని కొనియాడారు. తనకు చెడు అలవాట్లు ఏవీ లేవని వాటికి దూరంగా ఉన్నాను అంటూ వెల్లడించారు.