సినిమా హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. సినిమాల బడ్జెట్ పెరగడానికి అదే కారణం అనే మాటలు కూడా వినపడుతూ ఉంటాయి. అగ్ర హీరోల రెమ్యునరేషన్ దెబ్బకు కొందరు నిర్మాతలు చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నారు అనే మాట వాస్తవం. ఇక మన స్టార్ హీరోల కెరీర్ మొదట్లో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చూద్దామా…?
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తొలి రెమ్యునరేషన్ రూ.1116 మాత్రమే. ఇప్పుడు ఆయన 40 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ మొదటి సంపాదన నాలుగు లక్షలు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకు వంద కోట్ల వరకు తీసుకుంటున్నాడు అని టాక్.
విజయ్ దేవరకొండ
సినిమాల్లోకి రాక ముందు 500 తీసుకుని ట్యూషన్ చెప్పేవాడు ఈ హీరో. ఇప్పుడు పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
అల్లు అర్జున్
మొదటి సినిమాకు రాఘవేంద్ర రావు ఇచ్చిన అడ్వాన్స్ వంద రూపాయలు. పుష్ప రెండో పార్ట్ కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 80 కోట్లకు పైగానే ఉందని టాలీవుడ్ లో టాక్.